
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఊరక రారు మహానుభావులు. ఇక సీఎం కేసీఆర్ అయితే అసలే రారు. ప్రజా ముఖ్యమంత్రిగా ఉండాల్సిన సీఎం.. ప్రగతి భవన్ ముఖ్యమంత్రిగా, ఫామ్‌హౌజ్ ముఖ్యమంత్రిగా పేరు గాంచారు. ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించడమే గగనం. ప్రజల దాకా ఎందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకే ఆయన ముఖం చూపించరు. ఈటల రాజేందర్‌లాంటి నాయకుడినే ప్రగతిభవన్‌లోకి రానీయ్యలేదు. టీవీల్లో కేసీఆర్ ఫైల్ విజువల్స్ చూడటమే కానీ.. ఆయన నేరుగా దర్శనమిచ్చే సందర్భాలు అతి తక్కువే. ఇంత తక్కువగా ప్రజలకు ముఖం చూపించే సీఎం.. బహుషా దేశంలో కేసీఆర్ ఒక్కరేనేమో.
Seethakka: ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది కేసీఆర్ దీక్ష : సీతక్క
అలాంటి తెలంగాణ ముఖ్యమంత్రి రోడ్డెక్కారు. రైతుల కోసమంటూ ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆందోళన చేస్తుండటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరి ధాన్యం విషయంలో కొన్ని రోజులుగా కేంద్రంతో పోరాటం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అధికార పార్టీగా ఉండి కూడా ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ వద్ద మహాధర్నాకు దిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
TRS KCR : ఇందిరా పార్క్ సాక్షిగా కేసీఆర్ ఇజ్జత్ పాయే!
మహాదర్నాలో మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్‌తో ఈ యుద్ధాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ యుద్ధం ఒక్కరోజుతో ఆగేది కాదు.. ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను నిరసిస్తూ మహా ధర్నాకు దిగినట్టు కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్ ఛానెల్‌కు ఆంధ్రా సీఈవో.. వాటీస్ దిస్ కొలవర్రీ!
కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు కేసీఆర్. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని రైతులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వైఖరి రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని విమర్శించారు. కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ గవర్నర్ కు కొవిడ్ పాజిటివ్
మరోవైపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో కేసీఆర్ ధర్నా చేయడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాను అధికారంలోకి వచ్చిన రెండేండ్లకే ఇందిరాపార్క్ లో ధర్నా చౌక్ ను ఎత్తివేశారు కేసీఆర్. నిరసనలను నిషేదించారు. తెలపడానికి అవకాశం లేకుండా చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరకు ప్రజా సంఘాలు కోర్టుకు వెళ్లడంతో ఇందిరాపార్క్ కు మోక్షం లబించింది. ఇప్పుడా ఇందిరా పార్క్ లో కేసీఆర్ ధర్నా చేయడంతో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి. కేసీఆర్ ను కార్నర్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు .ధర్నా చౌక్ అవరసం కేసీఆర్ కు ఇప్పుడు బాగా తెలిసి వచ్చిందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- వైఎస్ వివేకాను వాళ్లే చంపేశారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..
- బండి సంజయ్‌పై కేసు నమోదు చేసిన నల్లగొండ పోలీసులు
- కలెక్టర్ కాదు కేసీఆర్ బంట్రోతు.. వెంకట్రామిరెడ్డి చరిత్ర చెప్పిన రేవంత్‌రెడ్డి
- బండా, కడియంలకు డిప్యూటీ సీఎం? కేబినెట్ నుంచి ఇద్దరు రెడ్లు ఔట్ ?