
క్రైమ్ మిర్రర్ : వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్. వైసీపీ ప్రభుత్వం ఏటేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఏపీ ఫార్మేషన్ డే సందర్భంగా నవంబర్ 1న వివిధ రంగాల ప్రముఖులకు ఇస్తున్న ఈ అవార్డు ప్రదానోత్సవం ఆసక్తికర పరిణామాలకూ వేదికవుతోంది. గతేడాది ఈ అవార్డును పలువురు ప్రముఖులు తిరష్కరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా, విజయవాడలో జరిగిన వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్.. వైఎస్సార్ ఫ్యామిలీ డ్రామాకు వేదికైందని అంటున్నారు. అందుకు కారణం.. వైఎస్ విజయమ్మ ఈ కార్యక్రమానికి హాజరవడం.
వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్రొగ్రామ్‌కు వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ హాజరవడం మామూలుగా అయితే పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని పరిణామాలు నేపథ్యంలో ఆమె రాక.. రాజకీయంగా ఆసక్తిగా మారింది. కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. అన్న మీద కోపంతో చెల్లి షర్మిల మెట్టింటికి మకాం మార్చేశారు. కొడుకు మీద అసహనంతో తల్లి విజయమ్మ సైతం కూతురు వెంటే హైదరాబాద్ వెళ్లిపోయారు. అప్పటి నుంచీ జగన్‌తో షర్మిల కానీ, విజయమ్మ కానీ.. టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు. వైఎస్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర కూడా వాళ్లు మాట్లాడుకోలేదు. దీంతో కుటుంబ కలహాలు తీవ్రంగా ఉన్నాయని తేలిపోయింది.
ఇటీవల హైదరాబాద్‌లో వైఎస్సార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు వైఎస్ షర్మిలా. తన తండ్రి వైఎస్సార్ పేరు మీదుగా తల్లి విజయమ్మ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జగన్ హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జగన్ తాను వెళ్లకపోవడమే కాదు.. వైసీపీ శ్రేణులెవరూ ఆ ప్రోగ్రామ్‌కు వెళ్లొద్దంటూ ఆదేశించడం.. తల్లి-చెల్లితో ఆయనకున్న విభేదాలకు నిదర్శనం అన్నారు. అలాంటిది.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనిది.. వైఎస్ విజయమ్మ తాజాగా జగన్‌తో వేదిక పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్ పేరు మీదుగా ఇస్తున్న.. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమానికి విజయమ్మ హాజరు కావడం.. జగన్‌తో ఒకే వేదికపై ఉండటం.. ఇంట్రెస్టింగ్ పాయింట్.
అయితే… ఒకే వేదికపై ఉన్నా.. కాస్త పక్క పక్కనే కూర్చున్నా.. తల్లి-కొడుకు పెద్దగా మాట్లాడుకున్నది లేదు. పలకరింపే బంగారమైంది వారి మధ్య. జగన్ సిగ్గుతో తలదించుకున్న వానిలా మౌనంగా ఉండిపోయారు. వారి మధ్య ఆప్యాయత కనిపించలేదు. ఏదో, ఫార్మాలిటీకి వచ్చామా.. ఉన్నామా.. వెళ్లామా.. అన్నట్టే సాగింది వ్యవహారం అంటున్నారు. అంటే, వైఎస్ కుటుంబంలో విభేదాలు అసలేమాత్రం తగ్గలేదని.. తల్లి-కొడుకు మధ్య సత్సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయని.. చెబుతున్నారు. తల్లి-చెల్లిని సరిగ్గా చూసుకోలేని జగన్.. ఇక ఏపీని, రాష్ట్ర ప్రజలను ఏవిధంగా పాలిస్తారో చెప్పేదేముంది.. అందుకే ఈ అరాచక పాలన అంటూ మండిపడుతున్నారు జనాలు.
One Comment