

క్రైమ్ మిర్రర్,మంగపేట ప్రతినిధి: ఏటూరునాగారం ప్రధాన రహదారి జీడివాగు వద్ద పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఏటూరునాగారం నుండి మంగపేట వైపు వెళ్తున్న విప్ రేగా కాంతారావు కారు ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ కారు ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే రేగా లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలందరు ఊపిరిపీల్చుకున్నారు.
అయితే కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు పడిగ మహేందర్, కొమరం మహేందర్లకు పలు గాయాలయ్యాయని సమాచారం. అనంతరం స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం డ్రైవర్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఎమ్మెల్యే రేగా కాంతారావు పండగకి ఏటూరునాగారంలో ఉన్న తన చుట్టాలను తీసుకొని రమ్మన్నారని డ్రైవర్లను పంపించారని సమాచారం. ఆ సమయంలో డ్రైవర్ కి కంటి మీద నిద్ర పోవడటంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల సమాచారం. ఏది ఏమైనా దసరా పండగపుట ఈ ప్రమాదం జరగడం పినపాక నియోజకవర్గ ప్రజలను ఎంతో ఆవేదనకు గురి చేసినట్లు తెలుస్తోంది.