
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన మండలంలో వెలుగుచూసింది.మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామ శివారులోని వ్యవసాయ భూముల వద్ద జరిగిన తవ్వకాలను శనివారం నాడు స్థానిక రైతులు గుర్తించారు.
గత కొద్దిరోజులుగా వర్షాలు కురియడంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళకపోవడంతో ఈతవాకలను ఎవరు గమనించలేదు.శనివారం నాడు అటుగా వెళ్లిన రైతులు తవ్వకాలను గమనించి స్థానిక సర్పంచ్ జంగిలి లక్ష్మీప్రసన్నకు సమాచారం అందించారు.ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.