
క్రైమ్ మిర్రర్, శామీర్ పెట్: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శామీర్ పెట్ మండల్ కేంద్రంలోనున్న శనివారం శామీర్ పేట పెద్ద చెరువువద్ద స్వచ్ఛత పక్వడా కార్యక్రమాన్ని జిల్లా యువజన క్రీడల శాఖా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యామ్ సన్ హాజరయ్యారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు,ప్రజాప్రతినిధులు, విద్యార్థులుతో స్వచ్ఛత పక్వడా ప్రతిజ్ఞ చేయించారు. వారానికి రెండు గంటలు కేటాయించడమే స్వచ్ఛత పక్వడా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.స్వచ్ఛత పక్వడాలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ సన్ కోరారు.కళాకారులూ తమ పాటలతో స్వచ్ఛత పక్వడా కార్యక్రమాన్ని ఉత్తేజ పరిచారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓవాణి,ఎంపిపి,ఎల్లుబాయి,సర్పంచ్,సెక్రటరీ,శానిటైసెషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.