
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి: వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి మరియు రమేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు. 2019 కంటే ఈ ఏడాది భారీ ధర పలికింది..
బాలాపూర్ లడ్డూని శశాంక్‌రెడ్డితో కలిసి దక్కించుకున్న ఏపీ ఎమ్మెల్సీ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వేలంలో పాల్గొన్నా: రమేశ్ యాదవ్, ఏపీ సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నా రమేశ్ యాదవ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలి కోరుకున్న ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్
బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు 2019లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు. ఆ సమయంలో రూ.17.60 లక్షలకు రాంరెడ్డి లడ్డూరు దక్కించుకున్నారు.
వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్ కారణంగా గతేడాది వేలంపాట జరగని విషయం తెలిసిందే. మరోవైపు భజన బృందం, డప్పు చప్పుళ్ల సందడి నడుమ ఊరేగింపు వైభవంగా సాగుతోంది. బాలాపూర్ ప్రధాన వీధుల్లో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహిస్తున్నారు