

- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
- ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరామర్శ
- ‘డబుల్’ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ
- భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
క్రైమ్ మిర్రర్, కొత్తగూడెం: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ లో సోమవారం కురిసిన భారీ వర్షానికి ఇండ్లు కూలిన బాధిత కుటుంబాలను మంగళవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షంతో ఇండ్లు కూలిపోయి వీధినపడ్డ బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, కో ఆప్షన్ సభ్యులు అరీఫ్ ఖాన్, డైరెక్టర్ దుంపల ఓంప్రకాష్, తీఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, భాగం మహేశ్వరరావు, కాసాని శ్రీనివాసరెడ్డి, పెయింటర్ రాజేష్, లక్ష్మణ్, ఖయ్యుం, భాస్కర్, కుమార్ స్వామి, యూసుఫ్, సుందర్ రాజ్, మసూద్, కొండా స్వామి, చుంచుపల్లి ఎమ్మార్వో, డీఎల్పీఓ, ఈఓఆర్డీ, ఆర్అండ్బి డీఈ, ఏఈ, పంచాయతీ రాజ్ ఈఈ, డీఈ, విద్యుత్ శాఖ ఏఈ, రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.