
ఎల్‌బినగర్ ప్రతినిధి క్రైమ్ మిర్రర్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు పాటుపడినప్పుడే చెరువులను కాలుష్య కూపంనుండి సంరక్షించుకున్నప్పుడే పర్యావరణ పరిరక్షణకు మరింత భద్రత కలుగుతుందని సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సీఈవో టీ సురేందర్ అన్నారు. సోమవారం ఎల్‌బినగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో సేవ్ ఎర్త్ ఫొందేషన్ మరియు జలమండలి, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కి) పారిశుద్య కార్మికుల సంయుక్త ఆధ్వర్యంలో సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యతిధిగా హజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. శాప్రీయ పద్దతిలో సెప్టిక్ ట్యాంక్‌ల నిర్వాహణ ఉంటే నీటి కాలుష్యాన్ని తగ్గించి చెరువులను కాపాడుకోవచ్చన్నారు. ఇందుకోసం ఫ్రీ డయల్ సెప్టిక్‌ట్యాంక్ టోల్‌ఫ్రీ నెంబరు 155313, 14420నెంబరులల్లో సంప్రదించ వచ్చన్నారు. ఈకార్యక్రమంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కా లేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కి ప్రతినిధి జీ నరేష్ సేఫ్ కోఆర్డినేటర్ టి శివరామకృష్ణ మధు, లక్ష్మణ్, అళ్విని, వెంకీ, శ్వేత, మాధవి, నవ్య తదితరులు పాల్గొన్నారు.