
క్రైమ్ మిర్రర్, తుర్కయాంజల్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్‌కే సాధ్యమని నాయకులు, ప్రజలు నమ్ముతున్నారని, అందుకే పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని సీనియర్ నేత గుండ్లపల్లి ధన్‌రాజ్‌గౌడ్ అన్నారు. ఇంజాపూర్ ఆపిల్ ఎవెన్యూ కాలనీలో ధన్‌రాజ్‌గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మంగ్లా నాయక్, గోపాల్ రెడ్డిసహా సుమారు 50మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చెబుతున్న మాయమాటలను రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. బడుగుబలహీనవర్గాలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని, పేదల భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోకుండా, తిరిగి వారిభూమినే లాక్కోవడం కేవలం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య, కౌన్సిలర్లు కాకుమాను సునీల్, బొక్క రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంట గోపాల్ రెడ్డి, బొక్క గౌతమ్‌రెడ్డి, మహేందర్ రెడ్డి, కాకుమాను చెన్నయ్య, మేతరి దర్శన్, కొత్తకుర్మ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.