
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లిః అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని మొగుళ్లపల్లి ఎస్ఐ మహేందర్ కుమార్ హెచ్చరించారు. ఎస్ఐ తన సిబ్బందితో శనివారం కలిసి పెట్రోలింగ్ నిర్వహింస్తుండగా చింతలపల్లి గ్రామానికి చెందిన దారుల శ్రీను, ఇస్సిపేట గ్రామానికి చెందిన రమేష్ లు తారసపడ్డారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి ఆటోను తనిఖీ నిర్వహించగా 12 క్వింటాల బియ్యాన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు.
XbRvQUDYGsKlqB