
క్రైమ్ మిర్రర్, జులై 26 నందిగామ: నందిగామలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987౼1988 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని కొత్తూరు మండల కేంద్రంలోని పేపర్ స్పోర్ట్ రిసార్ట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందంగా గడిపారు. 33 సంవత్సరాల తర్వాత మిత్రులందరూ ఒకేచోట కలిసి మంచిచెడులు పాలపంచుకున్నారు. జీవితంలో కులం, మతం తారతమ్యం లేకుండా ఉండేది ఒక్క స్నేహమేనని, ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం చేసుకునే విధంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.