
- మైనర్ బాలిక కేసులో విచారణ అధికారిగా ఎస్పీ సతీష్
- పారదర్శకంగా కేసు విచారణకు అన్ని రకాల చర్యలు
క్రైమ్ మిర్రర్: నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొప్పోలు గ్రామంలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య చేయబడినట్లు చెపుతున్న కేసు విషయంలో కేతేపల్లి ఎస్ఐ రామకృష్ణను వి.ఆర్.కు అటాచ్ చేస్తూ డిఐజి ఏ.వి. రంగనాధ్ ఉత్తర్వులు జారీ చేశారు. జులై 13వ తేది రాత్రి సమయంలో కొప్పోలు గ్రామంలో మైనర్ బాలిక అత్యాచారం,హత్య కేసులో పారదర్శక విచారణ కోసం ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించారు. ఈ కేసు సమగ్ర విచారణతో పాటు వాస్తవాలను వెలికితీసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ అధికారులు అన్ని కోణాలలో విచారణ చేయడం జరుగుతుందని చెప్పారు. కేసు విచారణ పారదర్శకంగా చేయడం కోసమే ఎస్పీ స్థాయి అధికారి చేత విచారణ చేయిస్తున్నామని చెప్పారు.