
మర్రిగూడ, జులై 8 క్రైమ్ మిర్రర్: వరి ధాన్యం అమ్మిన రైతులకు చెల్లించాల్సిన డబ్బులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. గురువారం మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో జరిగిన సిపిఎం శాఖ 8వ మహాసభకు ముఖ్య అతిధిగా పాల్గొని అయన మాట్లాడారు. రైతుల నుండి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసి రోజులు గడుస్తున్నా రైతులకు చెల్లించాల్సిన రూపాయలను చెల్లించలేదని దీంతో రైతులు తీవ్ర ఇబంధులను ఎదురుకుంటున్నారని ప్రభుత్వం తక్షణమే ధాన్యం అమ్మిన రూపాయలను చెల్లించాలని అయన డిమాండ్ చేశారు. ధాన్యం డబ్బులను బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోవద్దని హేచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలనీ కోరారు. అనంతరం పార్టీ శివన్నగూడ గ్రామ శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మైల సత్తయ్య సహాయ కార్యదర్శిగా చొప్పరి హనుమంతులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆకుల వెంకట్రామ్, సహాయకార్యదర్శి ఏర్పుల యాదయ్య, నాయకులు రామలింగం, రఘుమరెడ్డి, చిన్నమారయ్య, ఆంజనేయాచారి, సలయ్య, బిక్షం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.