
తుర్కయంజాల్,జూన్16 క్రైమ్ మిర్రర్: టీఆర్ ఎస్ కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతున్న తుర్కయంజాల్ చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్ మాట్లాడుతూ చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డి నిరంకుశ ధోరణిని అవలంబిస్తూ టీఆర్ఎస్ కౌన్సిలర్లకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ బడ్జెట్‌లో పార్టీల పరంగా నిధులు కేటాయించడం దారుణమన్నారు. ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్ నిధులను వార్డులకు కేటాయించకుండా పక్కదారి పట్టిస్తున్నారని, రిజర్వేషన్ నిధులను ఇప్పటివరకు ఎజెండాలో పొందుపర్చలేదని దుయ్యబట్టారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పారదర్శకంగా విచారణ జరిపి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు పుల్లగుర్రం కీర్తనావిజయానంద్‌రెడ్డి, గుండా భాగ్యమ్మ ధన్‌రాజ్, సంగీతమోహన్‌గుప్తా, వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి, సిద్దాల జ్యోతి జంగయ్య పాల్గొన్నారు.
One Comment