
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు,
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్
మహబూబ్ నగర్, జూన్ 3 క్రైమ్ మిర్రర్: కరోనా కట్టడికి ఇంకా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ప్రజల కదలికలు ఎక్కువగా లేకుండా చూడాలని, సమూహాలుగా ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, జ్వర సర్వేలో కరోనా లక్షణాలు గుర్తించిన వారి ఆరోగ్యంపై దృష్టి సారించి నిరంతరం పరిశీలించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుండి డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి కరోనాపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన తర్వాత కరోన పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ప్రజల కదలికలు ఇంకా తగ్గేలా చూడాలని, అంతేకాక పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల సందర్భంగా ఎక్కువమంది సమూహంగా ఏర్పడకుండా గ్రామాలు, వార్డుల వారిగా మ్యారేజ్ తనకి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా సర్వే సందర్భంగా జ్వరం, దగ్గు, జలుబు, వంటి లక్షణాలను గుర్తించిన వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని చెప్పారు. ఆయా మండలాల వారీగా ఇప్పటివరకు గత పదిహేను రోజులలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని గ్రామాల జాబితా రూపొందించాలని, మండలంలో ఐసొలేషన్ కేంద్రాలను వికేంద్రీకరించాలని, వ్యాక్సినేషన్ ను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం కరోనాపై విశ్లేషణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దాన్యం కొనుగోలుపై ఆయన సమీక్షిస్తూ వర్షాలకు ధాన్యం తడిసి పోకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, ఆదనపు కలెక్టర్లు కే. సీతారామారావు, తేజస్ నందలాల్ పవర్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, డిపి ఓ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.