
18న చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు.
అయినా ఆగని రోడ్డు కబ్జా యత్నాలు.
నల్లగొండ, క్రైమ్ మిర్రర్: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడ గ్రామ ప్రధాన రహదారి కబ్జాకు యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన రహదారిని విస్తరించాలని ఆర్ అండ్ బి అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రోడ్డు విస్తరణకు మార్కింగ్ కూడా చేశారు. ప్రధాన రహదారి రోడ్డు విస్తరణకు ఆర్ అండ్ బి అధికారులు మార్కింగ్ చేసిన ఖాతరు చేయకుండా, ప్రధాన రహదారి పైనే భవన నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధి ఒకరు ప్రయత్నం చేస్తున్న విషయంపై గ్రామస్థులు ఆర్ అండ్ బి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు ను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాన్నీ చేపడుతున్న వ్యక్తి పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆర్ అండ్ బి అధికారులు స్పందించడంతో, గత కొన్ని రోజులుగా నిర్మాణాన్ని నిలుపుదల చేసిన సదరు స్థానిక ప్రజా ప్రతినిధి, తిరిగి మళ్లీ నిర్మాణాన్ని ప్రారంభించడం పట్ల స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు కబ్జా చేస్తూ నిర్మాణాన్ని చేపడుతున్న స్థానిక ప్రజా ప్రతినిధి పై కేసులు నమోదు చేసి, రోడ్ కబ్జా యత్నాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు.