
బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు ఆయా మండల కేంద్రాల్లో
దీక్షలు చేపట్టిన బీజేపీ ముఖ్య నేతలు..
వికారాబాద్,మే 24,(క్రైమ్ మిర్రర్); రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 40 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని కోరుతూ సోమవారం నాడు జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో కొడంగల్, బొంరస్ పెట్, దౌల్తాబాద్, తాండూరు, పరిగి, యాలాల, నవాబ్ పెట్, దారుర్, మొమిన్ పెట్, కుల్కచర్ల, తదితర మండలాల్లో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో రైతు గోస, బీజేపీ పోరు దీక్షలో పాల్గొని ఒకరోజు తమ తమ స్వగృహంలో దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా ఏప్రిల్ నెలాఖరులోగ ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని రైతులకు పూర్తి స్థాయిలో గన్నీ బ్యాగులను కూడా సరఫరా చేయడం లేదని సమయం గడిచిపోతున్నా కొనుగోళ్లలో పురోగతి కనిపించకపోవడంతో రైతులు పెద్దఎత్తున ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం అయినప్పటికి రైతుల పరిస్థితి మరింత దిగజారిపోతోందని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించక పోవడం, కొన్ని కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించలేదని మరి కొన్ని కేంద్రాల్లో కేవలం 10 శాతం నుంచి 35 శాతం వరకే చెల్లింపులు జరిగాయని బీజేపీ జిల్లా నాయకులు ప్రహ్లాద రావ్, డాక్టర్ ఏ.చంద్ర శేఖర్,ఒక ప్రకటన లో తెలిపారు. కరోనా నేపధ్యంలో కూడా అన్నదాతలు ఎంతో వ్యధలు అనుభవించి ధాన్యం పండిస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సేకరణకు నిబంధనలు సడలించిన కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఎదురవ్వడం జరుగుతోందన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు తెలపడానికి, ఫిర్యాదులు చెప్పడానికి కూడా కావాల్సిన కనీస సమాచారం లేదని,ప్రత్యేక కార్యాచరణ తో అధికారులను నియమించి అవకాశాలు ఉన్న అన్నీ ప్రభుత్వ భవనాల్లో ధాన్యాన్ని నిల్వచేసే విధంగా చర్యలు తీసుకోవాలని దాన్యం తరలింపులో లారీలు లేకపోవడం తో కొనుగోలు మందకొడిగా సాగుతుందని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని,వరిలో తాలు, తరుగు,పేరుతో రైతులను వేధించడం సరికాదని కొనుగోళ్లలో ప్రామాణికతలు, పారదర్శకత,శాస్త్రీయత లోపంచడం వల్ల రైతులకు అన్యాయం జరగుతున్నదన్నారు. రైతులకు అన్యాయం జరగకుండ ఆదుకోవాలని అలాగే రైతు బంధు, నిధులకు విడుదల చేయాలని రైతు రుణమాఫీ, చేయాలని దీక్షలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఇంతవరకు జరిగిన కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
వాటిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.ఆయా మండల కేంద్రాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.