
– నివాళులర్పించిన వివిధ పార్టీలు, ప్రజా, యువజన సంఘాలు
– అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో బారి బైక్ ర్యాలీ
– అంబేద్కర్ ఆశయాలు సాధించాలి: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి
మునుగోడు ఏప్రిల్ 14 క్రైమ్ మిర్రర్ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలు బుధవారం మండల వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, ప్రజా, యువజన సంఘాలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో చేపట్టిన బారి బైక్ ర్యాలీలో జై భీమ్, అంబెడ్కర్ ఆశయాలు సాధించాలి అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికవేత్త, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారత రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎల్లపుడూ నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ఈ రోజు యావతు భారతావని ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశంలో అన్ని మతాలు తెగలు, దళితులు గిరిజనుల వెనుకబడిన కులాలు వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా వుండేందుకు సర్వసత్తాక సార్వభౌమాధికారం దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు అని అన్నారు. ఎంపీపీ కర్నాటి స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని నేటి యువత అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అతని అడుగుజాడల్లో నడిచి ఆశయాలను సాధించాలన్నారు. బొడ్డు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ అంటరాని తనాని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళల, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, పెరుమాల్ల కృష్ణయ్య, అనంత లింగ స్వామి, ముచ్ఛపోతుల శ్రీను, ఈద శరత్ బాబు, ముచ్చపోతుల రవి, దర్శనం వేణు కుమార్, పాలకూరి నర్సింహ గౌడ్, సిర్గమళ్ల రమేష్, యం శ్రీకాంత్, బెల్లపు శివయ్య, పి నర్సింహ, రామలింగయ్య, యాదగిరి, పి ఎల్ ఎస్, సాయి, సంపత్,బోల్లు సైదులు, బిల్లు రామలింగయ్య, జీవన్, శ్రీదర్, శ్రీను, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, వివిధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.