
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 02 క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాష్ట్రం సిద్దించి ఏడూ ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, తన చావుతో అయినా నిరుద్యోగుల దుస్థితి ప్రభుత్వానికి తెలిసొస్తుందని భావిస్తూ పురుగుల మందు తాగి మరణించిన కాకతీయ విద్యార్థి సునీల్ నాయక్ మృతికి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యె అని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందూస్థానీ నాయకులు ఆరోపిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏబీవీపీ వినోద్ హిందూస్థానీ, మాట్లాడుతూ రాష్ట్రంలో 1.90 లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ నిర్లక్ష ధోరణితో వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల చావుకు కారణం అవుతున్న కేసీఆర్ రాజీనామా చేయాలని, డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారాల్సిన యువత పీనుగలై పాడేక్కుతున్నారని విమర్శించారు. సునీల్ నాయక్ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, నిరుద్యోగ యువత ఆత్మ హత్యలకు ప్రభుత్వ నిర్లక్ష వైఖరే కారణం అని దీనిపై ,మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, పరిపాలన చేతగాని ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి ,గవర్నర్కు నివేదిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలు చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయకులు సనీల్, మురళీ, రామకృష్ణ, సుధీర్, మనోజ్, గోపాల్, ప్రశాంత్, యశ్వంత్, మహేష్, జగన్, నవీన్ , తదితరులు పాల్గొన్నారు.