
ఎల్బీ నగర్, ఏప్రిల్ 02 క్రైమ్ మిర్రర్ : లింగోజిగూడ డివిజన్‌ను ముంచెత్తుతున్న వరదనీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను తీసుకొస్తామని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్పొరేటర్లతో, నాయకులతో, కార్యకర్తలతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సామ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదనీటిని సాగర్ రింగ్‌రోడ్డు నుండి నేరుగా మూసీనదిలో కలిపేందుకు తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను ఇప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను ఇక మీదట నీట మునిగనిచ్చేదిలేదని తేల్చిచెప్పారు. కొందరు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. పలు ప్రాంతాల్లో ఉన్న నాలాలను పరిశీలించారు. ఎల్బ్ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 10 సంవత్సరాల నుండి ఆయన ఏం అభివృద్ధి చేశారని తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి, కళ్లెం నవజీవన్‌రెడ్డి, , వంగా మధుసూదన్‌రెడ్డి, రావుల వెంకటేశ్వర్‌రెడ్డి, చింతల అరుణ సురేందర్‌యాదవ్, ఎన్.పవన్‌కుమార్, రంగ నర్సింహాగుప్త, బద్దం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి, ఆకుల శ్రీవాణి అంజన్, మాజీ కౌన్సిలర్లు కొత్త రవీందర్‌గౌడ్, కళ్లెం రవీందర్‌రెడ్డి, నాయకులు ఆకుల అఖిల్ పవన్‌గౌడ్, జిట్టా సురేందర్‌రెడ్డి, విజయభాస్కర్, భరత్‌యాదవ్, శ్రీకాంత్, పల్లె గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.