
నల్లగొండ, క్రైమ్ మిర్రర్ : జ్ఞానమే ధర్మం.. విజ్ఞానమే గమ్యమని సుప్రీం స్వేరో, ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. జ్ఞాన సమాజ నిర్మాణంలో భాగంగా స్వేరో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చెరువు గట్టు, ఎల్లారెడ్డిగుడెంలో పోచమ్మ, మైసమ్మ ఇతర గ్రామ దేవతలు ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. చర్లపల్లిలో విలేజ్ లెర్నింగ్ క్లాసులను ప్రారంభించారు. మామిడాల గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. జొన్నగడ్డలగూడెంలో ఏర్పాటు చేసిన భీం విందు(ఉద్యోగుల ఆత్మీయ కలయిక)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నత ప్రతిభ చూపి పని చేస్తున్న చోట ప్రత్యేక గుర్తిపు సాధించాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగులందరూ సమన్వయంతో కలసి కట్టుగా పని చేయాలన్నారు. సంపాదనలో కొంత భాగం భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం పొదుపు చేయాలని సూచించారు. అటెండర్ నుండి ఐఏఎస్ వరకు శక్తి వంచన లేకుండా ఆత్మన్యూనతా భావాన్ని వదిలివేసి జ్ఞాన సమాజ నిర్మాణం కోసం భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. వేల సంవత్సరాల నుండి అణచివేతకు గురై, అట్టడుగు బిడ్డలు గొప్ప గొప్ప యూనివర్సిటీస్ లో చదివి లోకాన్ని సాచించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు సామాజిక భాధ్యత కలిగిన విప్లవకారులని, ఖండ కావరo ఉన్న వారికి ఆత్మ గౌరవంతో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎస్బీ ఇన్స్పెక్టర్ సైదులు మరియు పలు డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.