
అంతిమ సంస్కారాలు నిర్వహించిన పెద్దకూతురు
మునుగోడు,ఏప్రిల్ 2 క్రైమ్ మిర్రర్ :మునుగోడు పోలీస్ స్టేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎఎస్ఐ గ విధులు నిర్వహిస్తున్న పొల ప్రభాకర్ 55సం రాలు గుండెపోటుతో గురువారము రాత్రి మృతి చెందాడు. ఇతనికి బార్య మనోహరి ఇద్దరు కూతుర్లు ప్రవళిక,ప్రవనిక ఉన్నారు. హార్ట్ ఎటాక్ రావడముతో కుటుంబసభ్యులు హైద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి తుది శ్వాస విడిచారు. ఇతని మరణం వార్త తెలిసిన మునుగోడు సహచర సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇతని పార్థివదేహాన్ని నల్లగొండ లోని లైన్ వాడ స్వగృహనీకి తరలించారు. ఎఎస్ఐ పార్థివదేహాన్ని నల్లగొండ డీస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, చండూరు సిఐ సురేష్ కుమార్, మునుగోడు ఎస్ ఐ రజినీకర్ రెడ్డి, మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామి, పోలీస్ సిబ్బంది. సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. నిర్వహించిన అంతిమ యాత్రలో తన పెద్ద కూతురు ముందుండి అన్నితానై అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పెద్దకూతురు ప్రవలిక తండ్రికి ముందుండి నడుస్తున్న సమయములో ఒకే సారి కుటుంబ సభ్యులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇరువురు అధికారులు మాట్లాడుతూ ప్రభాకర్ 1990 బ్యాచ్ కు చెందిన అతను విధినిర్వహణలో ఎంతో ఓర్పుగా వుండి ఎన్నో భూవివాదస్పదమైన సమస్యలు పరిష్కరించడం జరిగినదని అతను మానుండి దూరం కావడం దురదృష్ట కరమని పోలీస్ శాఖ ఓ మంచి వ్యక్తిని కోల్పోయిందని అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆశించారు. కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లపుడూ తోడు వుంటుందన్నారు. ఈ కార్యక్రమములో ఉజ్వాల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు నాగరాజు గౌడ్, బీజేవైఎం నాయకులూ పందుల రాజేష్, దుబ్బ రాజశేఖర్, పోలే రాజు, బొజ్జ వెంకన్న, జిట్టగొనీ సైదులు, పోలీస్ సిబ్బంది. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు,సైదులు, నాగరాజు, రామ నర్సింహ, లింగ రాజు, వెంకన్న, హుసేన్, సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు.