
రాజేంద్రనగర్, ఏప్రిల్ 01 క్రైమ్ మిర్రర్ : రాజేంద్రనగర్ డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. అసద్‌ఖాన్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడు అసద్‌ఖాన్ ఓ హత్య కేసులో నిందితుడని.. ప్రత్యర్థులు హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం చేరుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో రెండు నెలలుగా వరుస హత్యలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.