
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : అన్ని రంగాల్లో మహిళలు సాధికారిత సాధించెలా పోలీసు శాఖలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ సేవలు అందిస్తున్న
మహిళా పోలీసులు సమాజానికి గర్వకారణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అధిబట్ల పోలీస్ స్టేషన్లో స్థానిక ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం జరిగింది. స్టేషన్లో పనిచేస్తున్న మహిళ పోలీసు సిబ్బంది ఎంతో ఆనందంతో మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. స్టేషన్ ఆవరణలో మహిళా సిబ్బంది కేక్ కట్ చేసుకుని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఏసీపీ యాదగిరి రెడ్డి ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్సై సురేష్,ఎస్సై లక్ష్మీ నారాయణ, asi రాఘవేందర్ రెడ్డి, రాము తదితర సిబ్బంది అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుండగా పోలీసు శాఖలో మహిళలకు ప్రాధాన్యత పెరిగింది, పోలీసు నియామకం పోస్టుల్లో 33 శాతం సిబ్బంది మహిళలే ఉండడం గర్వకారణము. రాచకొండ పోలిసు కమిషనరేట్‌తో పాటు వివిధ పోలీసు కార్యాలయాలకు మహిళలే భద్రత కల్పిస్తున్నారని… దేశంలో ఎక్కడ ఈ తరహా విధానం లేదని ఇటీవల ఉన్నతాధికారులు చెప్పారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో సమానంగా మహిళా సిబ్బంది భాగస్వాములుగా ఉండటం విశేషం. కరోనా సమయంలో కుడా మహిళా సిబ్బంది కూడా విధులు నిర్వహించారు. అన్ని సమయాల్లో ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రతి మహిళ సిబ్బందికి సెల్యూట్..!