
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : చౌటుప్పల్ మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో చౌటుప్పల్ మండలం, మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల నాలుగు బూతుల పచ్చీస్ ప్రభారీల సమావేశం రిక్కల సుధాకర్‌రెడ్డి, ఊడుగు వెంకటేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మునుగోడు ఇంచార్జీ, గంగిడి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ప్రాథమికోన్నత విద్యను నిర్విర్యం చేశారని, వాగ్దానాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమైయా రన్నారు. ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని టీచర్స్‌ను ఉద్యోగులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారని తెలిపారు. దేశంలో ఇంత బలహినమైన ముఖ్యమంత్రి లేడని, నోటిఫికేషన్‌లు, ఇవ్వకుండా మోసం చేయటం ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేయకుండా నాటకలడుతున్నారని మండిపడ్డారు. అవినీతిలో కురుకుపోయిన ఫామ్‌హౌన్ ప్రభుత్యాన్ని సాగనంపల్సిందేనని, పట్టభద్రులు, ఉద్యోగులు అలోచించి ఓటు ద్వారా ఈ ప్రభుత్వనికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల బిజెపి పార్టీ తరపున పోటీ చేస్తున్న గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని పట్టభద్రుల యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించడానికి పచ్చీస్ ప్రభారీలు, బూతు కన్వినర్‌లు, సీనియర్ నాయకులు అందరు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశ నిర్ధేశం చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్రనాయకులు దూడల భిక్షంగాడ్, గుజ్జుల సురేందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, పట్టణ ఉపాధ్యక్షులు గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డి, బత్తుల జంగయ్యగౌడ్, దాసోజు భిక్షమాచారి, కైరంకొండ అశోక్, కౌన్సిలర్‌లు బండమీది మల్లేషం, పోలోజు శ్రీధర్‌బాబు, ఆలె నాగరాజు, ఉబ్బు భిక్షపతి, కడవేరు పాండు, కట్ట కృష్ణ, కంచెర్ల గోవర్ధన్‌రెడ్డి నారెడ్డి దామోదర్‌రెడ్డి, చింతల సుధాకర్‌రెడ్డి, నారెడ్డి రాజిరెడ్డి, వనం ధనుంజయ, గుర్రం పాండురంగం, గోషిక పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.