
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం పాలకవర్గం వార్షికోత్సవాన్ని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యని డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బంది సత్కరించారు. . ఈ సందర్భంగా కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధికి అందరూ దోహదపడాలని, జిల్లాలోనే నెంబర్‌వన్ బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బ్యాంకులో లావాదేవీలు పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ, సామ సంజీవరెడ్డి, కుతాడి నర్సింగరావు, కొండ్రు స్వప్న, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, జక్క కృష్ణారెడ్డి, సామ సత్యనారాయణరెడ్డికి పుష్పగుచ్చం, శాలువాలు కప్పి సత్కరించారు.