
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపాలిటీ 23వ వార్డులో కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్‌నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మున్సిపాలిటీ టీఆర్ ఎస్ అధ్యక్షుడు కందాళ బలదేవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోందని అన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా సభ్యత్వ నమోదులో పాలు పంచుకోవాలన్నారు. కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సభ్యులను చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు మన్మోహన్ సింగ్, దశరథ్ నాయక్, బొడియ నాయక్, కె.శ్రీను, రాజుగౌడ్, కృష్ణ, సాగర్, రవి, లాలూ నాయక్, రెడ్యా నాయక్, ఆంజనేయులు, సాగర్, రాకేష్ నాయక్ పాల్గొన్నారు.