Telangana

కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కోటి వృక్షార్చన

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, స్థానిక కౌన్సిలర్ సిద్ధాల జ్యోతి జంగయ్య, తుర్కయంజాల్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కందాల బలదేవ రెడ్డి కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పుట్టినరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఏడు సంవత్సరాల కాలంలో మొక్కలు నాటే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. రాష్ట్రమంతటా పచ్చదనం పెరిగి ప్రకృతి పరవశించిపోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాలుగో వార్డు అధ్యక్షులు పల్లె ఆంజనేయులు, దేవేందర్ ముదిరాజ్, గోవర్ధన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.