
ఆ ప్లానర్ నిర్వకాలకు … ఇవిగో ఆధారాలు
ప్రభుత్వ , కన్జర్వేషన్ భూముల్లో అనుమతులు
పంచాయితీ అనుమతుల పేరిట…
ఎల్ ఆర్ ఎస్ కు ఎగనామం
క్రైం మిర్రర్ ప్రతినిధి – హైదరాబాద్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో ఒక ప్లానర్ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ, కన్జర్వేషన్ భూముల్లో అనుమతులిప్పించి , కోట్లకు పడుగలెత్తాడు . ఈ విషయమై క్రైమ్ మిర్రర్ వరుస కథనాలు ప్రచురిస్తోంది .అయితే క్రైం మిర్రర్ ప్రజాగొంతుక మారి, అవినీతి, అక్రమాలను వెలికితీయడం గిట్టని కొంతమంది వ్యక్తులు కేసుల పేరిట బెదిరించే ప్రయత్నాలను చేస్తున్నారు. ఉడుత ఊపులకు క్రైమ్ మిర్రర్ ఎప్పుడూ కూడా భయపడ దని మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము ఎవరిపైన నిరాధారమైన ఆరోపణలను చేయం. మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కనుకే… మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ, చట్టాలను తుంగలో తొక్కి, అడ్డదారుల్లో ప్రభుత్వ భూముల్లో, కన్జర్వేషన్ జోన్ లో అనుమతులిప్పించడం తప్పని మాత్రమే ప్రజాభిప్రాయాన్ని మా పత్రిక వేదిక గా తెలియజేస్తున్నాం. ప్రజల తరుపున మాట్లాడడమే నేరమన్నట్లు, అదేదో అక్రమమన్నట్లు కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. అయినా ఏనుగు వెళ్తుంటే ఎన్నో కుక్కలు అరుస్తుంటాయనుకుని… మా పనిగా ప్రజాభిప్రాయాన్ని మేము విన్పిస్తున్నాం. యంజాల్ మున్సిపాలిటీ ప్లానర్ ప్రభుత్వ, కన్జర్వేషన్ భూముల్లో అనుమతులిప్పించారనడానికి మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. తుర్కయంజాల్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 6 ప్రభుత్వ స్థలం లో 150 గజాల్లో ఇంటి నిర్మాణ అనుమతులిప్పించినట్లు టౌన్ ప్లానింగ్ రికార్డుల ద్వారా స్పష్టం అవుతోంది. గ్రౌండ్ ప్లస్ ఒక అంతస్థు కు గ్రామ పంచాయితీ నుంచి గతం లోనే అనుమతులు తీసుకున్నారని చెబుతూ, సదరు దరఖాస్తుదారుడు ఎల్ ఆర్ ఎస్ ఫీజు కూడా మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయలేదు. ఖాళీ స్థలం కు గ్రామ పంచాయితీ నుంచి భవన నిర్మాణ అనుమతులు ఎలా లభించాయో సదరు యంజాల్ మున్సిపాలిటీ ప్లానర్ కు మాత్రమే తెలియాలి. దాన్ని ఆధారంగా చేసుకుని అప్పటి అధికారులు ఎల్ ఆర్ ఎస్ లేకుండా ఎలా అనుమతులు జారీ చేశారన్న ప్రశ్న కు సమాధానం లేకుండా పోయింది. హెచ్ ఎం డి ఏ పరిధి లో ఎప్పటి నుంచో అసలు గ్రామ పంచాయితీలు భవన నిర్మాణ అనుమతులు జారీ చేయవద్దన్న నిబంధన ఉండనే ఉన్నది.. అయినా కూడా ఆ అనుమతుల ఆధారంగా ఎల్ ఆర్ ఎస్ లేకుండా అనుమతి ఇప్పించాడంటే యంజాల్ మున్సిపాలిటీ ప్లానర్ ఎంతటి ఘనుడో ఇట్టే అర్ధం అవుతుంది. రాగన్నగూడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 279, రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో యంజాల్ మున్సిపాలిటీ ప్లానర్ 150 గజాల్లో గ్రౌండ్ ప్లస్ ఒక అంతస్తుకు అనుమతులిప్పించాడు. ఇకపోతే మునగనూరు గ్రామ పరిధి లో సర్వే నెంబర్ 72 కన్జర్వేషన్ జోన్ లో 156 గజాల్లో గ్రౌండ్ ప్లస్ ఒక అంతస్తుకు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి అనుమతులిప్పించిన ఘనత యంజాల్ మున్సిపల్ ప్లానర్ ది. ఇలా చెప్పుకుంటూ పొతే… యంజాల్ మున్సిపల్ ప్లానర్ అక్రమాలు కోకోల్లలుగా ఉన్నాయి. వాటన్నింటిని వెలుగులోకి తెచ్చేందుకు క్రైమ్ మిర్రర్ సిద్ధంగా ఉంది. ప్రజలకు చెందాల్సిన మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ, అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న యంజాల్ మున్సిపాలిటీ ప్లానర్ అవినీతి, అక్రమాల భాగోతాన్ని ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకువచ్చి అతన్ని దోషిగా నిలబెట్టే వరకు మా ఈ పోరాటం ఆగదు.
Names rase guys leva Mee paper ki….
If u wanna expose the culprit then first write the articles with names …then only ur news get credentials….
అవినీతి అక్రమలా పై … క్రైమ్ మిర్రర్ చేస్తున్న అక్షర యజ్ఞం… ప్రజాసమ్యలపై నిరంతరం మీ పోరాటం కొనసాగించాలి.