
ఆయన చెప్పాడంటే అనుమతులు జారీ చేయాల్సిందే.?
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి – హైదరాబాద్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో ప్రభుత్వ భూముల్లో కన్జర్వేషన్ భూముల్లో అధికారుల చేత అనుమతులు ఇప్పించాలంటూ అది ఓకే ఒక్కడికే సాధ్యం. అంతలా అధికారులను తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం సివిల్ ఇంజనీర్ కానీ ఆ ప్లానర్ కే సాధ్యం అయింది. దానికి కారణం.! తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ గా అప్పట్లో వ్యవహరించిన తన సామాజిక వర్గం అధికారి యేనన్నది బహిరంగ రహస్యమే. మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ గ్రామానికి చెందిన కన్జర్వేషన్ భూముల్లో సదరు యాంజాల్ మునిసిపాలిటీ ప్లానర్ కోరిక మేరకు ఆనాటి కమిషనర్ ఒత్తిడి కారణంగా టి పి ఎస్ అనుమతులు జారీ చేశారు. అయితే కన్జర్వేషన్ భూముల్లో అనుమతి ఇవ్వడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కలెక్టర్, టి పి ఎస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాటి తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్, ప్లానర్లు ఒత్తిడి మేరకు తాను అనుమతులు జారీ చేసినట్టు టి పి ఎస్ చెప్పుకున్నప్పటికీ అతడి వాదన అరణ్య రోదనే అయింది. కన్జర్వేషన్ భూముల్లో అనుమతులు జారీ చేసినందుకు టీపీఎస్ సస్పెండ్ కావడంతో చేసేదిలేక ఆనాటి మున్సిపల్ కమిషనర్, తనకు అత్యంత సన్నిహితుడైన ప్లానర్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లైసెన్స్ రద్దు అయిన తర్వాత కూడా అదే ప్లానర్, మున్సిపాలిటీలో అనుమతులు ఇప్పించడం లో తాను ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా పైరవీలు చేయగలిగారు. అంటే కేవలం కంటితుడుపు చర్యగానే ఆ ప్లానర్ లైసెన్సును కమిషనర్ రద్దు చేసినట్లుగా తేటతెల్లమవుతుంది. తమ అక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక బీసీ అధికారిని బలి చేసి, తమ చేతులు దులుపుకోవడం కాకుండా తమ అక్రమాలను యధేచ్చగా కొనసాగిస్తూ వచ్చారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో మంజూరైన ఇంటి నిర్మాణ అనుమతుల పై ప్రస్తుత కమిషనర్ షఫీయుల్లా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగు చూస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఒక ప్లానర్ కు మాత్రమే కమిషనర్ అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయన చెప్పినట్లుగా నడుచుకునీ, ప్రభుత్వ భూముల్లో కన్జర్వేషన్ భూముల్లో అనుమతులు జారీ చేసినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. యంజల్ మున్సిపాలిటీ ప్లానర్ , ఆయన సామాజిక వర్గానికి చెందిన కమిషనర్ పని చేసినప్పుడు మంజూరైన భవన నిర్మాణ అనుమతుల పై ఉన్నతాధికారులు స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని కోరుతున్నారు.
నిజాలు నిర్భయంగా అందించే లక్ష్యంగా క్రైమ్ మిర్రర్ ముందుంటుందని అనుకుంటున్నా …