
మీరే డేట్ ఫిక్స్ చేసి.. ఒక గంట ముందు ఫోన్ చేసి నాకు చెప్పండి చాలు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : నిజామాబాద్ అంటే నిజాంసాగర్ నీరు, రైతాంగం గుర్తుకు వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ అంటే ఆత్మ గౌరవంతో బ్రతికే పచ్చకండువా కప్పుకున్న పసుసు రైతులు గుర్తుకు వస్తారని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతులు పోరాడుతున్నారు.
పసుపు బోర్డును తీసుకువస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, తన మాటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పసుపు బోర్డు కోసం ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్ నేతలు ‘రాజీవ్ రైతు భరోసా’ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ’ప్రతి మనిషి జీవితంలో పసుపు ఎంతో ముఖ్యమైనది. యాంటిబయటిక్ గా కూడా పసుపును వాడుతుంటారు. ఇంతటి విసిష్టత కలిగిన పసుపు పంటను పండించే రైతుకు మాత్రం మద్ధతు ధర లేక నష్టపోతున్నారు. పసుపు పంటకు కనీసం 15వేల మద్దతు ధర తీసుకువస్తానని గత ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఆ హామీని నిలబెట్టుకోవాలి.‘ అని అన్నారు. పసుపు రైతుల కష్టాలు విన్నాననీ, తాను దీక్షకు వచ్చేటప్పుడు చిమల దండు లాగా రైతులు దారిపోడువున తనకు సంఘీభావం తెలిపారని గుర్తు చేసుకున్నారు.