
కన్జర్వేషన్, ప్రభుత్వ భూముల్లో అనుమతులు…
ఇప్పించడం లో దిట్ట ఆ ప్లానర్
అధికారులకు లడ్డులిస్తాడు.. అందుకే అయన చెప్పిందే వారికి వేదం
క్రైం మిర్రర్ ప్రతినిధి – హైదరాబాద్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి లోని ప్రభుత్వ భూముల్లో, కన్జర్వేషన్ జోన్లలో అనుమతులిప్పించడం ఎవరికైనా సాధ్యమేనా? అంటే అక్కడ అంతా ఒకే ఒక ప్లానర్ కు మాత్రమే సాధ్యమని అంటున్నారు. అధికారులు ఎందుకు అంతగా ఆయన చెప్పినట్లు నడ్చుకుంటారని ఆరా తీస్తే… నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి సదరు ప్లానర్ చెప్పినట్లు ప్రభుత్వ భూముల్లో, కన్జర్వేషన్ జోన్లలో అనుమతులివ్వడం వెనుక లడ్డులే కారణమని తెలుస్తోంది. ఇంజాపూర్ గ్రామ పరిధిలోని కన్జర్వేషన్ జోన్ లో సదరు ప్లానర్ చెప్పినట్లుగా అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారి, ఒక బహుళ అంతస్థు భవనానికి అనుమతులు మంజూరు చేశాడు. అయితే కన్జర్వేషన్ జోన్ లో బహుళ అంతస్థు భవనానికి అనుమతులు మంజూరు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దానితో కన్జర్వేషన్ జోన్ లో అనుమతులిచ్చిన టీపీఓ ను బాధ్యున్ని చేస్తూ, అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే టీపీ ఓ చేత తన సామాజిక వర్గానికి చెందిన ప్లానర్ చెప్పినందుకు అనుమతిలిచ్చే విధంగా ఒత్తిడి తెచ్చిన అప్పుడు తుర్కయంజాల్ కమిషనర్ గా, ప్రస్తుతం జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఉన్నత అధికారి, ఇక్కడే కొత్త నాటకానికి తెర లేపారు. తాను చేసిన తప్పిదానికి కింది స్థాయి అధికారిని బలి చేయడమే కాకుండా, తాను సస్పెన్షన్ నుంచి తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడ లో భాగంగా , ఆ ప్లానర్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. లైసెన్స్ రద్దు చేసిన తరువాత సదరు ప్లానర్ మున్సిపాలిటీ లో యధావిధిగా ఎలా ప్లానర్ గా కొనసాగరన్న ప్రశ్న కు సదరు కమిషనర్ , ప్రస్తుతం జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ గా కొనసాగుతున్న అధికారి సమాధానం చెప్పాలి… లైసెన్స్ రద్దు ఒక నాటకం… అధికారి తో కలిసి ప్లానర్ వేసిన ఎత్తుగడ ఏంటి ? వచ్చే సంచిక లో చదవగలరు.