
రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్ ప్రారంభం
లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, హాజరైన జిల్లా మంత్రి సబిత, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
బాటసింగారంలో 40 ఎకరాల్లో రూ.40కోట్లతో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాటసింగారంలో 40 ఎకరాల్లో రూ.40కోట్లతో నిర్మిస్తున్న లాజిస్టిక్ పార్క్‌లో అత్యుత్తమ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో యువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. త్వరలోనే లాజిస్టిక్ పాలసీ తీసుకొస్తామన్నామని, త్వరలో కేబినెట్‌లో ఆమోదిస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, వెలిమినేడులో ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులకు రెండెకరాల స్థలంలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. బండరావిరాల మైనింగ్ జోన్ బాధితులకు మంచి కాంపన్సేషన్ ఇస్తామన్నారు.