
ఉత్తమ గ్రామ పంచాయతీ గా జీల్లెళ్ల గ్రామం ఎన్నిక
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదగా ఉత్తమ అవార్డు అందుకున్న సర్పంచ్ ఎముక జంగయ్య
ఉత్తమ గ్రామ పంచాయతీ గా జీల్లేళ్ళ
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని జిల్లెల్ల గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీ గా ఎన్నికైది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అవరణ లో కల్వకుర్తి ఏం.ఎల్. ఏ జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ శర్మన్ ఆధ్వర్యంలో డి.పి.ఓ బి. రాజేశ్వరి, డీఎల్పీవో పండరి నాథ్ ల చేతుల మీదుగా జిల్లెల్ల గ్రామ సర్పంచ్ ఎముక జంగయ్య ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. గ్రామంలో పచ్చదనం – పరిశుభ్రత తో పాటు విద్యాభివృద్ధి,శానిటేషన్, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, కంపోస్ట్ షేడ్, స్మశాన వాటిక నిర్మాణం పూర్తి తో మహిళా సంఘాల సాధికారతకు కృషి చేయడంతో పాటు బడికి పోని పిల్లలను బడిలో చేర్పించడం జరిగింది. కావున ఉత్తమ గ్రామ పంచాయతీ గా జిల్లెల్ల గ్రామం ఎంపిక చేయడం జరిగిందన్నారు. నాతో కలిసి గ్రామాభివృద్ధికి సహాయ, సహకారాలు అందించి, గ్రామభి రుద్దికి కృషి చేసిన వి. శుభ శేఖర్ రెడ్డి ,ఉప సర్పంచ్ జి. రాజు , సెక్రటరీ ఇందిరా, మాజీ ఉపసర్పంచ్ పి. పాండు గౌడ్, వార్డు మెంబర్లు కె.నాగమణి , జి. పాండురంగ రెడ్డి, కె.రవి గౌడ్, టి.మౌనిక మల్లయ్య, ఏం. సాయమ్మ, సి. హెచ్ ఆంజనేయులు,వి.అరుణమ్మ,కో ఆప్షన్ మెంబర్ లు జీ. బాల్ జంగయ్య, పి. సుజాత తో పాటు పారిశుద్య సిబ్బంది రామస్వామి, ముత్యాలమ్మ, జి. రాములు, డి. చంద్రయ్య లతో పాటు గ్రామ యువజన సంఘాల నాయకులు, మహిళ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.