
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : భారత దేశ 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్పల్లి రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ చౌరస్తా నుండి సరూర్ నగర్ చెరువు కట్ట వరకు రైతులతో, ట్రాక్టర్లతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముక రైతే అని అలాంటి రైతులు గత కొన్ని నెలల నుండి ఢిల్లీ లో నిరాహార దీక్ష చేస్తున్న కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రోజు రోజుకి రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు, రాబోయే రోజుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లెంకి ధనరాజ్ గౌడ్, చిక్కుళ్ల శివప్రసాద్, ఇమ్రాన్, రంజిత్, నానావల జ్ఞానేశ్వర్, నబి, జాకీర్, అభిషేక్, సంతోష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.