
నాసిరకం పనులు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్న అరవింద్‌రెడ్డి
రాజకీయ నేతలు, అధికారుల అండదండలు ఉండటంతో రెచ్చిపోతున్న కాంట్రాక్టర్
సీసీ రోడ్డు పనుల్లో డస్ట్ వాడుతూ నాసిరకం పనులు
ముడుపులు అందుతుండటంతో కాంట్రాక్టర్ తీరును ప్రశ్నించని ఉన్నతాధికారులు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి అభివృద్ధిని అధికారులు, రాజకీయ నేతల అండదండలతో కాంట్రాక్టర్ అరవింద్‌రెడ్డి అడ్డుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతలతో పాటు, ఈఈ, డీఈ, ఏఈ స్థాయి అధికారుల వరకు ముడుపులు అందిస్తూ కాంట్రాక్టర్ అరవింద్‌రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిగి మున్సిపాలిటీ పరిదిలో నాసిరకం రోడ్లు వేసి కోట్ల రూపాయలు దండుకుంటుంటే దానికి సంబంధిత అధికారులు వత్తాసు పలుకుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుకకు బదులుగా డస్టు, నాట్ ఫర్ రిటైల్ సేల్ సిమెంట్ వాడుతూ కాంట్రాక్టర్ తన చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లను నరికి అమ్ముకుంటున్నారు, పరిగి మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల రోడ్ల పనుల రూ.10కోట్ల టెండర్లు పిలిచి, విడుదల చేశారు. రాజకీయ నేతల అండదండలు ఉండటంతో పలువురు అధికారులను కాంట్రాక్టర్ అరవింద్ రెడ్డి తన చేతిలో పెట్టుకున్నారు. భారీగా డబ్బులు మిగిల్చుకుందామన్న తాపత్రంయంతో నాసిరకంగా పనులు చేపడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఏఈ కూడా వివరణ ఇవ్వకుండా సమాచారాన్ని దాచిపెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇప్లిమెంట్ ప్రకారం సీసీ రోడ్డు మొత్తం 100% ఇసుకతో వేయాలి. సైజు ప్రకారం కంకర వేయాలి. నాణ్యమైన సిమెంట్ వాడలి. అలా వాడకుండా ఒక్క డస్టు మాత్రమే వాడుతూ కోట్ల రూపాయల ప్రజ ధనాన్ని నిలువునా దోచుకుంటుంన్నాడు కాంట్రాక్టర్ అరవింద్‌రెడ్డి. అధికారులు కాసులకు కక్కుర్తి పడి పనులు జరిగే సమయాల్లో చుట్టపు చూపులుగా వచ్చి వెళ్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, నాణ్యత పాటించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని పరిగి పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఏస్