
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోరూ.2.73 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, చైర్ పర్సన్ మల్‌రెడ్డి అనురాధ రాంరెడ్డితో కలిసి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపనలు చేశారు. బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని, కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి అన్ని విధాలా తోడు ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కాలనీలను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు మరో రూ.10 కోట్లు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మంగమ్మ శివకుమార్, కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కోశికె ఐలయ్య, కౌన్సిల్ టీఆర్ ఎస్ ఫ్లోర్ లీడర్ రమావత్ కల్యాణ్‌నాయక్, కాంగ్రెస్ కాకుమాను సునీల్, నారని కవితాశేఖర్‌గౌడ్, మేతరి అనురాధ దర్శన్, రేవల్లె హరితయాదగిరి, పలువురు టీఆర్ ఎస్ కౌన్సిలర్లు, తుర్కయంజాల్ టీఆర్ ఎస్ అధ్యక్షుడు బలదేవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా పాల్గొన్నారు.