
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిరాల రెండో వార్డలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్మన్ మధు మోహన్ పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధిలో భాగంగా కాల్వ రమేష్ ఇంటి వద్ద నుంచి అంబోజి శ్రీకాంత్ ఇంటి వరకు నిర్మించతలపెట్టిన భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు మధుమోహన్ తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి దశలవారీగా శాశ్వత పరిష్కారం చూపుతానని చైర్మన్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో లింగ ఆంజనేయులు, అంబోజు శ్రీకాంత్, కందికంటి శ్రీనివాస్, యాదగిరిరెడ్డి, రెండో వార్డుకు చెందిన నాయకులు పలువురు పాల్గొన్నారు.