
క్రైమ్ కేసులు ఛేదించడంలో మేటిగా పేరు తెచ్చుకున్న జగదీశ్వర్
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పతకం సీఎం సర్వోన్నత పతకాన్ని అందుకున్న జగదీశ్వర్
ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా తొలి ప్రయత్నంలోనే 156మందికి ఉద్యోగాలు కృషి చేసి భేష్ అన్పించుకున్న సీఐ
జగదీశ్వర్ సార్ ఆశీస్సులు సెంటిమెంట్‌గా భావిస్తోన్న ఇబ్రహీంపట్నం యువత
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ( నాగుల ఆనంద్ నేత ) రామచంద్రాపురం (RC పురం) సీఐ జగదీశ్వర్ పోలీసు వృత్తిని నిబద్ధతతో కొనసాగిస్తూనే… సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లాఠీ పట్టి డ్యూటీ చేయడమే కాదు… పలుగు పట్టి పనిచేయడానికి వెనుకాడరు. పాత మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన జగదీశ్వర్‌ది అంతులేని సేవా గుణం. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన జగదీశ్వర్… వారి కోసం తనవంతుగా ఏదైనా చేయాలన్న తపన కలిగిన వ్యక్తి. 2016లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్థాపించిన ఎంకేఆర్ ఫౌండేషన్ జగదీశ్వర్ ఆలోచనలోంచి పుట్టినదే. అప్పుడు ఇబ్రహీంపట్నం సీఐగా పనిచేస్తున్న జగదీశ్వర్ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉండటాన్ని గమనించి ఈ కార్యక్రమం చేపట్టేలా ఎమ్మెల్యేను ఒప్పించారు. మొదటి ప్రయత్నంలోనే 1200మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారు. 40మంది అమ్మాయిలతో సహా 156మంది ఉద్యోగాలు సంపాదించారు. ఇలా ప్రతి నోటిఫికేషన్ సమయంలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ ఇప్పటివరకు ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు సాధించారు. దీనంతటికీ జగదీశ్వర్ వేసిన పునాదే కారణమని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. జగదీశ్వర్‌కు పోలీసు శాఖలోనూ మంచి పేరు ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా వాటి ఛేదనకు ముందుగా జగదీశ్వరే గుర్తొస్తారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులో దోపిడీ కేసును జగదీశ్వరే ఛేదించారు. జగదీశ్వర్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నో రివార్డులు, అవార్డులు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉన్నత పతకమైన సీఎం సర్వోన్నత పతకాన్ని జగదీశ్వర్ అందుకున్నారు. ఇబ్రహీంపట్నం సీఐగా పనిచేస్తున్న సమయంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలో జగదీశ్వర్ ఆధ్వర్యంలో నాటిన చెట్లు ఇప్పుడు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పోలీస్‌స్టేషన్ మొత్తం పచ్చదనం నిండిపోయింది. ఆ చెట్లను చూసినప్పుడల్లా ఇవి జగదీశ్వర్ సార్ పెట్టించనవి ఇప్పటికీ స్థానికులు చెప్పుకుంటుండటం ఆయన మంచి తనానికి మచ్చుతునక.
సీఐ, జగదీశ్వర్
పేద కుటుంబంలో పుట్టా. ఉదయాన్నే లేచి ఇంటింటికీ తిరిగి పేపర్ వేశా. నాన్న తాపీమేస్త్రి. మమ్మల్ని బాగా చదించాలన్న తపన ఆయనలో ఉండేది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదువుకున్నాం. అదే ఇప్పుడు నన్ను ఈస్థాయిలో నిలబెట్టింది. నాలాంటి పేద కుటుంబంలోనుంచి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ చేయూతనివ్వాలి. నేను ఎక్కడ పనిచేసినా యువతకు తొలి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తా. నా సర్వీసు కాలంలో కనీసం 10000మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే నా ధ్యేయం.