
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన వ్యక్తి స్వామి వివేకానంద అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాశనసభ్యులు ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ అన్నారు. నేడు స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా ఉప్పల్ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో “వాక్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్బంగా మాట్లాడుతూ పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతం, ఆధ్యాత్మికత, యోగా, తత్వాలను పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించిన వారిలో వివేకానంద స్వామి చేసిన ప్రసంగాలు, రచనలు చాలా మందిలో స్ఫూర్తి నింపాయి అని తెలిపారు. అటువంటి వ్యక్తి అయన పురస్కరించుకుని ప్రతి ఏడాది జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. ఈకార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ బిజెపి నాయకులు శిల్పా సునీల్ కుమార్ రెడ్డి, గోరిగే కృష్ణ, మహంకాళి లక్ష్మణ్, రావుల బాలక్రిష్ణ గౌడ్, కొల్లు బాలరాజ్, దేవేందర్ రెడ్డి, ఫణీందర్, రెవెళ్లి రాజు,రాజేందర్ గౌడ్, బోరంపేట మురళీకృష్ణ, నామ శ్రవణ్, సింగారం కార్తిక్, ప్రకాష్ గౌడ్, గోరిగె ఐలేష్, ఆకుల ఋషికేష్, రావుల అఖిలేష్ గౌడ్, అభిరామ్, విజయ్ గౌడ్,నవీన్ గౌడ్, ఆడెపు రమేష్, గోరిగె శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.