
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : రాజేంద్రనగర్ పరిధిలోని లక్ష్మీ కూడా రాజీవ్ గృహకల్ప మైదానంలో అయోధ్య రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మందిర నిర్మాణ నిధి సమర్పణ మరియు జన జాగరణ యొక్క సమావేశం జరిగింది.
యావత్ హిందూ సమాజాన్ని అయోధ్య మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చార్మినార్ భాగ్ సహ శారీర ప్రముక్ భీమనపల్లి వెంకటేష్ పిలుపునిచ్చారు. జనవరి 20 నుండి ఫిబ్రవరి 10 వరకు జరిగే ఈ యొక్క నిధి సమర్పణ అభియాన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీరాముడు తమకు ఇచ్చిన అదృష్టంగా భావించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ధర్మ జాగరణ ప్రముఖు అడికే సత్యనారాయణ జీ, లక్ష్మీగూడనగర్ కార్యనిర్వాహక్ శ్రీహరి జీ, సహకర్యవాహ సురేష్ జీ మరియు స్థానికులు పాల్గొన్నారు.