
క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్
తుర్కయంజాల్‌లో అవినీతి రాజ్యమేలుతోందని క్రైమ్ మిర్రర్‌లో వరుస కథనాలు
20వ వార్డులో కౌన్సిలర్ భర్త గోపాల్‌రెడ్డి అరాచకాలపై పరిశోధనాత్మకమైన కథనాలు
క్రైమ్ మిర్రర్ కథనాలకు స్పందించిన మున్సిపల్ కమిషనర్, టీపీవో
క్రైమ్ మిర్రర్ ప్రచురించిన అక్రమ షెడ్డు నిర్మాణం నిలిపివేత, సీజ్
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో అవినీతి, అక్రమాలపై క్రైమ్ మిర్రర్ లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. 20వ వార్డులో అక్రమ నిర్మాణాలు, కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సంచలనాత్మక విషయాలు వెలుగులోకి తెచ్చింది. క్రైమ్ మిర్రర్ కథనాలు అక్రమార్కుల గుండెల్లో అక్షర తూటాలను ప్రచురిస్తుంది. ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ భర్త గోపాల్‌రెడ్డి అరాచకాలు, ఆకృత్యాలు, కబ్జాలు, అక్రమ లే అవుట్ల దందాలను వెలుగులోకి తెచ్చింది. ఈ కోవలోనే సాగర్ రహదారిపై పెద్ద ఎత్తున అక్రమంగా నిర్మిస్తున్న ఓ భారీ షెడ్డు నిర్మాణాన్ని క్రైమ్ మిర్రర్ బహిర్గతం చేసింది. ఈ షెడ్డులో మల్టీలెవల్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయబోతున్నారని, ప్రజా ప్రతినిధులకు భారీగా ముడుపులు అందాయని సంచలన విషయాలు బయటపెట్టింది. క్రైమ్ మిర్రర్ సంచలన కథనాలతో షెడ్డు నిర్మాణం నిలిచిపోయింది. సోమవారం రోజున కమిషనర్ షఫీ ఉల్లా, టీపీవో ఉమ ఆ షెడ్డును సీజ్ చేస్తున్నట్లు ప్రకటించి. బ్యానర్ ఏర్పాటు చేశారు. 20 వార్డులోని పలు అక్రమ నిర్మాణాలను సీజ్ చేస్తూ, నోటీసులు అంటించారు. సాగర్ రహదారిపై ఆరంతస్థుల భవనంతో పాటు పలు అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలకు గురైన స్థలాల్లో మున్సిపాలిటీ బోర్డులు ఏర్పాటు చేయించారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో వెలక్కాయ పడినట్లు అయింది. ఈ షెడ్డు వెనుక పెద్దపెద్ద తలకాయలు ఉండటంతో పరిణామాలు ఎటువైపునకు దారి తీస్తాయో.. ఎంతెంత చేతులు మారతాయో సంచలన కథనాలతో క్రైమ్ మిర్రర్ మీకు తెలియజేస్తూనే ఉంటుంది. ఈ వ్యవహారం లో కీలకంగా వ్యవహరించి, డబ్బులు ముట్టజెప్పిన ఓ ప్లానర్ పై ప్రతేకమైన కథనం త్వరలో మీ క్రైమ్ మిర్రర్ లో..
నిఘా వ్యవస్థ నిద్రపోతే… క్రైమ్ మిర్రర్ కాపుగాస్తుంది.