
నేడు అఖిలప్రియ కు బెయిల్ వచ్చే ఛాన్స్?
ప్లీజ్ పేట భూకుంభకోణం వెనుక సూత్రధారులు ఎవరు?
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకురాలుఅఖిలప్రియ అరెస్టు వెనుక అధికార పార్టీ పెద్దలు ఉన్నారా అంటే అవుననే ఆమె సోదరి భూమా మౌనిక రెడ్డి చె బుతున్నారు. కుట్రపూరితంగా నేత మా అక్క అఖిలప్రియ ను అరెస్టు చేయించారని ఆమె ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గవర్నర్ ను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని కలుస్తామని చెప్పుకొచ్చారు. అఖిల ప్రియ బెయిల్ పై నేడు కోర్టులో వాదనలు జరగనున్నాయి. అఖిలప్రియ కు బెయిలు మంజూరు చేయవద్దని ఇప్పటికే బోయినపల్లి పోలీసులు కోర్టుకు విన్నవించుకున్నారు. అఖిల ప్రియ కు బెయిల్ మంజూరు చేస్తే ఆమె సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని చెప్పుకొచ్చారు. అఖిల ప్రియ గర్భవతి కావడంతో నేడు ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కుటుంబ సభ్యులతో పాటు న్యాయవా దులు భావిస్తున్నారు. అఖిలప్రియ బెయిల్ మంజూరు అయిన తర్వాత ఆమె అరెస్టుకు కుట్ర చేసిన వారు ఎవరు చెబుతామని ఇప్పటికే ఉమా మౌనిక రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. భూమా మౌనిక రెడ్డి ప్రకటనతో ఈ వ్యవహారమంతా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ రామ్ బోయిన్ పల్లి కి చెందిన ప్రవీణ్ రావు ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన అనంతరం వారి కుటుంబ సభ్యులు అధికార టీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ మాలోతు కవిత జోక్యం తోనే పోలీసులు ఆగమేఘాల మీద స్పందించి ప్రవీణ్ రావు, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడా కూడా అధికార పార్టీ నేతల పేర్లను బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో అఖిల ప్రియ అరెస్ట్ వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారన్న, భూమా మౌనిక రెడ్డి ఆరోపణలకు బలం చేకూర్చి నట్లయింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిన్న మియాపూర్ భూ కుంభకోణం… నేడు ఆఫీస్ పేట భూకుంభకోణం ఈ రెండింటి వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారన్న ఆరోపణలు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భూ మాఫియా ను పెంచి పోషిస్తున్నది ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.