
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ ను వెంటనే రద్దు చేయాలని బిల్డర్స్ అండ్ ప్లానర్స్ అసోసియేషన్ కన్వీనర్ మాకం గంగాధర్ నేత డిమాండ్ చేశాడు. టీఎస్ బిపాస్ వల్ల వేలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిండు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజుకింత పెరుగుతున్న తరుణంలో స్వయం ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ పనిచేసుకునే యువతను కూడా రోడ్డున పడేసే విధంగా ఉన్న టీఎస్ బిపాస్ వంటి చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందని, ఇప్పుడు టి ఎస్ బి పాస్ అమలు ద్వారా కూడా అదే ఫలితాన్ని చూడ వలసి వస్తుందని తెలంగాణ బిల్డర్స్ అండ్ ప్లానర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఎల్.ఆర్ .ఎస్ కు వ్యతిరేకంగా రియల్టర్లు డాక్యుమెంట్ రైటర్లు ఉద్యమించిన తరహాలోనే, టి ఎస్ బి పాస్ కు వ్యతిరేకంగా తాము కూడా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల పొట్టను కొట్టి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి బిల్డర్స్ అండ్ ప్లానర్స్ యొక్క సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.