
తుర్కయంజాల్ మున్సిపాలిటీకి షాడో చైర్మన్, వైస్ చైర్మన్లు
మున్సిపాలిటీ పరిధిలో అందుబాటులో ఉండని చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డి
అన్నీ తానై చూస్తున్న 22వ వార్డు కౌన్సిలర్ కొశిక ఐలయ్య
మల్‌రెడ్డి రాంరెడ్డి అన్ని పనులను ఐలయ్యకే అప్పగించారని గుసగుసలు
వైస్ చైర్ పర్సన్ హరిత ధన్‌రాజ్‌గౌడ్‌కు ఎలాంటి ప్రాధాన్యమివ్వడంలేదంటున్న అనుచరులు
మరో కౌన్సిలర్ కుంట ఉదయశ్రీ భర్త గోపాల్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆఫ్‌లైన్ టాక్
ఇద్దరి వార్డులూ మెయిన్‌రోడ్డుకు ఉండటంతో భారీగా ముడుపులు అందుతున్నాయని ముచ్చట్లు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టు ప్రచారం సాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు బహిరంగంగానే చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీకి అన్నీ తానే అన్నట్టు కొశిక ఐలయ్య వ్యవహరిస్తున్నారని ఇంటర్నల్ టాక్ నడుస్తోంది. చైర్ పర్సన్ అనురాధరాంరెడ్డి మున్సిపాలిటీ పరిధి అందుబాటులో ఉండకపోవడంతో ఐలయ్యకే అన్ని బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. రాంరెడ్డికి ఐలయ్య నమ్మినబంటు కావడం, ఆర్థికంగానూ బలంగా ఉండటంతో ఐలయ్య పట్ల అభిమానంగా ఉన్‌రట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 20, 22వ వార్డులు మెయిన్ రోడ్డుపై ఉండటం, కలెక్షన్లు కూడా ఫుల్‌గా వస్తుండటంతో వీళ్ల వైపు రాంరెడ్డి మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఏ కార్యక్రమాలు చేసినా, చేపట్టినా ఐలయ్య కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆయన ఏం చెబితే చైర్ పర్సన్ అదే చేస్తున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్ కౌన్సిలర్ల వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైస్ చైర్ పర్సన్ హరిత ధన్‌రాజ్‌గౌడ్‌ను ఐలయ్య అసలు దేకడం లేదని, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదన్న గుసగుసలు మొదలయ్యాయి. ఇంజాపూర్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హరిత ధన్‌రాజ్‌గౌడ్‌కు సమాచారమే ఇవ్వలేదట. నా వార్డు పరిధిలో జరిగిన ఓపెనింగ్ కార్యక్రమానికి నాకే సమాచారం ఇవ్వరా? అంటూ ధన్‌రాజ్‌గౌడ్ బహిరంగంగానే ఐలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారట. తన వార్డు పరిధిలో ఐలయ్య అక్రమ వసూళ్లకూ పాల్పడుతున్నారని, ఒక్కో ఇంటికి రూ.25లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారట. ఐలయ్య వ్యవహారశైలిపై లోలోపల విమర్శలు ఎక్కువే ఉన్నాయట. డబ్బు, అనుచరబలగంతో ఐలయ్య నెట్టుకొస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.
ఇక 20వ వార్డు కౌన్సిలర్ కుంట ఉదయశ్రీ భర్త గోపాల్‌రెడ్డి వసూళ్లకు అంతేలేదని తెలుస్తోంది. మెయిన్ రోడ్డుపై జరిగే నిర్మాణాలన్నీ ఇతని కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, పెట్రోల్ బంక్ పక్కన ఏర్పాటు చేస్తున్న భారీ షెడ్ యజమాని దగ్గర పెద్ద ఎత్తున వసూలు చేశాడని, ఆ షెడ్ యజమాని తన బంధువు అని చెప్పుకుంటూ వేరెవరికీ మామూళ్లు ఇవ్వడం లేదట. ఈ షెడ్ ఏర్పాటు కోసం ప్రజాస్వామ్య ఫోర్త్ ఫిల్లర్స్‌ను మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్డు పరిధిలోని అక్రమ నిర్మాణాలను కమిషనర్ కూల్చివేయించిన 10రోజులకే గోపాల్‌రెడ్డి కనుసన్నల్లో మళ్లీ మొదలైనట్టు ప్రచారం సాగుతోంది. అటు ఐలయ్య, ఇటు గోపాల్‌రెడ్డి వసూళ్ల పర్వం మొత్తం రాంరెడ్డికి తెలుసే అని, అతనే వీరిని అడ్డుపెట్టుకొని వసూళ్లకు తెరలేపారని జనాలు గుసగుసలాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేసిన ప్రతి ఒక్కరికీ రూ.1.40కోట్లు యావరేజ్‌గా ఖర్చు అయ్యాయని… అన్ని డబ్బులు తిరిగి ఎలా సంపాదించగలమని ఇతర కౌన్సిలర్లు మొరపెట్టుకుంటుంటే, మెయిన్ రోడ్డుపై వీరిద్దరి వార్డులు ఉండటంతో ఈ 10 నెలల కాలంలో అప్పుడే వారికే డబ్బులు తిరిగి వచ్చి ఉంటాయన్న ముచ్చట్లు ఎక్కువ అయ్యాయి. మొత్తంగా కొశిక ఐలయ్య చైర్మన్‌గా, గోపాల్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ…. అందరినీ మేనేజ్ చేస్తున్నట్టు ఇంటర్నల్ టాక్.