
అమరావతి క్రైమ్ మిర్రర్ న్యూస్ : రాష్ట్రంలో ఆలయా విగ్రహాలపై దాడులకు పాల్పడటం దుర్మార్గం వరుసగా జరుగుతున్న దాడులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. దేవాలయాలపై దాడులకు పాల్పడ్డ దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. విగ్రహాలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. అంతర్వేది రథం దగ్ధం చేసిన వారిని ఇంత వరకు గుర్తించకపోవడం ప్రభుత్వ, పోలీసుల అసమర్ధతకు నిదర్శనమని మండిపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే దుశ్చర్యలను ఖండిస్తున్నామని రామకృష్ణ చెప్పారు.