
క్రైమ్ మిర్రర్ న్యూస్ : తెరాస , కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాజ్యాంగ విరుద్ధ పనులు చేయడం తమకు ఇష్టం లేదని అన్నారు. ప్రజల మద్దతుతో 2023 లో తెలంగాణ లో అధికారం లోకి వస్తామని చెప్పారు. శుక్రవారం గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ బిజెపి బృందం ప్రతినిధులు కలిశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ. తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిహెచ్ఎంసి పాలక వర్గానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్ల చేత ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయించాక పోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. లింగోజిగూడ కార్పొరేటర్ గా విజయం సాధించిన ఆకుల రమేష్ గౌడ్ పదవి ప్రమాణ స్వీకారం చేయకుండానే మృతి చెందడం బాధాకరమన్నారు. కార్పొరేట ర్లు గా ఎన్నికైన వెంటనే వారిచేత ప్రమాణస్వీకారం చేయించి ఉంటే ఈ పరిస్థితి రమేష్ గౌడ్ కు తలెత్తి ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.