
ఇంజపుర్ లోని ఇళ్లు కూల్చి వేత..
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఇంజపుర్ లోని ప్రభుత్వ సర్వే నెంబర్ 225 ను కబ్జా చేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇంటి నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే స్థానికుల పోరాటంతో స్పందించిన అధికారులు ఈ నెల 24 వ తేదీన ad సర్వే నిర్వహించారు. ఇందులో కబ్జా దారుల బాగోతం బయటపడింది. దీనిపై వరుసగా మీడియా లో కథనాలు రావడంతో స్పందించిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ సైదులు, ఆర్ ఐ కవిత సోమవారం నాడు ప్రహరీ గోడను కూల్చడంతో పాటు, కంచెను ఏర్పాటు చేశారు. అదే సమయంలో వెంచర్ నిర్వాహకులు అడ్డుకోగా అక్కడి నుండి వెళ్లిపోయారు. మంగళవారం నాడు తెల్లవారు జామున జేసీబీ ని తీసుకుపోయిన అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగ కుండ దాదాపు పూర్తి కావొచ్చిన నిర్మాణాని నెల మట్టం చేశారు.
అధికారుల నిర్ణయం పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక మీదట ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నా వారికి ఒక హెచ్చరిక లాంటిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.