
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ట్రంక్లైన్ నిర్మాణ పనులను సరూర్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆకుల అరవింద్ కుమార్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ ట్రంక్ లైన్ నిర్మాణం పూర్తయితే డ్రెయినేజీ వ్యవస్థలొ శాశ్వత పరిష్కారం జరుగుతోందని. నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. కార్పొరేటర్ పారుపల్లి అనిత రెడ్డి తీవ్రంగా కృషి చేశారని ఆయన అన్నారు. ఈ వరద నీటి కాలువ ఒకటిన్నర ఫీట్లు సామర్ధ్యం కలిగి ఉంటుందని. క్రమ్ప్ నిధులతో BSCPL ఏజెన్సీ ద్వారా పనులు జరుగుతున్నాయని. సరూర్ నగర్ గ్రామంలో గాంధీ బొమ్మ నుండి జోనల్ ఆఫీస్ వరకు ప్రధాన రహదారి సి సి రోడ్డు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆకుల తెలిపారు. ప్రధానంగా భగత్ సింగ్ నగర్ నుండి ఒక ట్రంక్ లైన్ విజయపురి కాలనీ నుండి నాగోల్ వరకు మరొక ట్రంకు లైన్ పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయని వివరించారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారి కృషి తో ఆ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిఆర్ఎస్ నాయకులు సప్పిడి గోవర్ధన్ రెడ్డి, మైనార్టీ లీడర్ మహ్మద్ సలీం, ఎడ్ల మహేందర్ గౌడ్, నర్సిమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.