
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ మరియు ధరణి పోర్టల్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల న్యాయకత్వంలో హయత్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు మహ దర్నా నిర్వహించడం జరిగింది. ఇది ధర్నాకి వివిధ పార్టీల నాయకులు తెలుగుదేశం,కాంగ్రెస్, బిజెపి, తెలంగాణ ఇంటి పార్టీ వివిధ పార్టీల నాయకత్వంలో హయత్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంను ముట్టడి చేయడం జరిగింది. అనంతరం రియల్టర్లు వ్యాపారస్తులు మరియు అఖిలపక్ష పార్టీల నాయకులు అందరూ కలిసి జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా బొంగు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఇలాంటి జీవోలు తీసుకురావాలని బొంగు వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇలాంటి జీవోలను తీసుకొచ్చి పేదలపై ఎల్ఆర్ ఎస్ రుసుము పేరుతో ప్రభుత్వం పేద ప్రజల పై గుదిబండ మోపుతుందని వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశం ప్రకారం LRS 131 జీవోను తీసుకవచ్చిందో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వివరించాలని డిమాండ్ చేశారు. LRS ప్రక్రియను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ పాత పద్ధతిలోనే కార్డు సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 24వ తారీఖు ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నా కు అఖిల పక్ష నాయకులు, ప్రజా సంఘాలు, రియల్టర్స్ వ్యాపారస్తులు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.